ప్రభుత్వ వైద్యశాలలో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండాలి. 

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ వైద్యశాలలో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండాలి. 

– జ్వరాల కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, వైద్య సేవలు అందించాలి. 

– జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆదేశం. 

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ వైద్యశాలలో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, వెంకటాపురం సివిల్ వైద్యశాలను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ శుక్రవారం ఉదయం సందర్శించి డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. పేషేంట్ల కు అందే వైద్య సౌకర్యాలు ను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్యూటీ మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడారు. అలాగే జ్వరాల బారిన పడి చికిత్స పొందుతున్న పేషెంట్లను వారికి అందే వైద్య సదుపాయాలు కేస్ షీట్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రౌండ్ ఓ క్లాక్ వైద్యశాలగా ఉన్న వెంకటాపురం సివిల్ వైద్య శాలలో మందుల నిల్వలు, రక్తపరీక్ష కేంద్రాలను, రికార్డులను, మెటర్నటి వార్డులను, సిబ్బంది వివరాలను పరిశీలించి, అందుకు అనుకూలంగా మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నూగురు గిరిజన గ్రామాన్ని సందర్శిం చారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, మురికి నీటి గుంతలు, నిర్మూలన, డ్రైనేజీ పూడిక లు , చెత్తాచెదారం తదితర అంశాలపై ఆయా గృహస్థులకు అవగాహన కల్పించి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండా లని, దోమల బారిన పడకుండా మురికి నీటి గుంటలను నిర్మూలించేందుకు, చెత్తాచెదారాన్ని ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయాలని కోరారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ పూడిక తీత తదితర పనులను బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ తదితరాం శాలపై అందుకు అనుకూలంగా నూగురు పంచాయతీ కార్యదర్శి వేణుకు ఆదేశాలు జారి చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు పరిసరాల పరిశుభ్రతతో ముందుకు సాగాలన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాల యంలో అధికారులతో సమావేశం నిర్వహించి రికార్డులను పరిశీలించారు. మండలంలో వివిధ అంశాలు, భూములు రేషన్ కార్డులు, నిత్యవసర వస్తువులు,భూములు , ఇతర ప్రజా పాలన అంశాలపై తహసీల్దార్ ను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ లక్ష్మీ రాజ య్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ మహేందర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment