అంగరంగ వైభవంగా శ్రీ గణపతి హోమం
– తరలివచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం,వాజేడు మండలాల్లో కార్తీకమాసం సంద ర్భంగా దేవాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజా కార్యక్రమాలతో కిటకిటలాడుతున్నాయి. వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీ గణపతి హోమం పూజా కార్యక్రమాన్ని వేద పండితులు మంత్రోచ్ఛా రణ మధ్య శాస్త్రత్తంగా వైభవంగా నిర్వహించారు. శ్రీ విఘ్నే శ్వర స్వామి వారి గణపతి హోమం తిలకించేందుకు కరక దుర్గమ్మ వారి ఆలయానికి భక్తులు ప్రసాదాలతో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో హోమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా హోమం పూర్తయిన వెంటనే భక్తులకు వేద పండితులు ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ ఉమారామ లింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇష్టపురి గ్రామంలోని శ్రీ గణేష్ దేవాలయం, శ్రీరామ టెంపుల్, ఇంకా అనేక దేవాల యాల్లో భక్తులు కార్తీక మాసం ప్రారంభం నుండి పూజా కార్యక్రమాలకు రావడంతో భక్తిరస సందడి నెలకొన్నది. అలా గే ఆదివారం శ్రీ ఉమారామ లింగేశ్వరస్వామి వారి ఆలయం లో అయ్యప్ప, శ్రీ భవాని మాల దారణ భక్తులకు దినపత్రిక జర్నలిస్టు కే. గణేష్ దంపతులు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మాలధారణ భక్తులతో పాటు సివిల్ భక్తులు పెద్ద సంఖ్యలో అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.