స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాదించాలి

Written by telangana jyothi

Published on:

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాదించాలి

– బీజెపీ శ్రేణులకు సీ.ఎన్.ఆర్ పిలుపు

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాదించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి హాజరైన బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి లు పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి హాజరై బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజెపీ పార్టీ దాదాపు 32 వేల పై చిలుకు ఓట్లు సాధించిందని అన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఉచిత హామీలన్నింటిని రూప కల్పన చేసి ప్రజలకు ఆరు గ్యారంటీలు అనీ అబద్దపు వాగ్దానాలు చేశారని, గెలిపించిన తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను పట్టించుకోకుండా ఢిల్లీ విహార యాత్రలు చేస్తున్నారని అన్నారు. ఉచిత బస్సు అనీ పెట్టి మహిళా సోదరిమనులను తిప్పలు పెడుతున్నారని సునీల్ రెడ్డి అన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలకు శ్రీధర్ బాబు ను నమ్మి ఆరు గ్యారంటీలు, ఆరు పర్యాయలు ఓట్లు వేసి గెలిపిస్తే మంథని నియోజకవర్గానికి అయన చేసిన అభివృద్ధి గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండం మల్లా రెడ్డి, మాజీ అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, కాటారం ఇంచార్జి సంపత్, బీజేపీ నాయకులు పాగే రంజిత్, చీర్ల తిరుపతి రెడ్డి, గంట అంకయ్య, చీర్ల బాపు రెడ్డి, దుర్గం తిరుపతి, డోలి అర్జయ్య, తోడే వీరా రెడ్డి, బండి రమేష్, అజ్మీరా వేణు, రాజేశం రెడ్డి, లాకు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now