మిర్చి ఏరేందుకు కూలీల కొరత

మిర్చి ఏరేందుకు కూలీల కొరత

మిర్చి ఏరేందుకు కూలీల కొరత

– మిరపచెట్లపైనే ఎండుతున్న కాయలు

– పంట నష్టం వస్తుందని మిర్చి రైతు ఆత్మహత్య

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మిర్చి పంట ఏరేందుకు కూలీల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కూలీలు దొరకక చెట్టుపైనే కాయలు ఎండుతుండటంతో ఓ రైతు పంటనష్టంతో ఆత్మహత్యకు కాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రామెళ్ళ సతీష్(35) అనే రైతు కూలీల కొరతతో పంట ఎండుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ సుమారు మూడు ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశాడు. మిరప పళ్ళు పండిపోయి ఉండగా, వాటిని కోసేందుకు కూలీలు దొరకక మొక్క పైనే మిరప పళ్ళు ఎండిపోతున్నాయి. గత రెండు వారాలుగా కూలీల కోసం తిరుగుతున్నా దొరకడంలేదు. దీంతో అప్పుల పాలవుతాననే భయంతో పంట చేనులోనే తరుచూ మద్యం సేవిస్తూ మనోవేదనకు గురయ్యాడు. మద్యం మత్తులో పురుగుమందు తాగాడు. బంధువులు సతీష్ ను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని వైద్యశాలకు తరలిం చారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెంది నట్లు వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలి పారు. సతీష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. రైతు రామెల్ల సతీష్ మృతి చెందడంతో బెస్తగూడెం గ్రామంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment