ఉగాది పురస్కారాల్లో వర్షశ్రీకి బంగారునంది అవార్డు
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : ఉగాది పురస్కారాల్లో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీల్లో గుర్రం వర్షశ్రీ ఉత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణనంది అవార్డుకు ఎంపికయ్యారు. భూపాలపల్లికి చెందిన గుర్రం సుజాత రాజశేఖర్ దంపతుల కుమార్తె వర్షశ్రీ ఈనెల 16నన హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వ హించిన జాతీయ స్థాయి గౌతమి స్వర్ణనంది పురస్కా2025కు ఎంపికైనట్లు మాస్టర్ తూర్పాటి నాని తెలిపారు. కేఎన్డీ ట్రస్ట్ విశ్వవిఖ్యాత ఆర్ట్స్, కల్చరల్ అకాడమి నిర్వాహకులు ఎస్.వీ.ఆర్.వెంకటేష్, కోటేశ్వరమ్మ, దైవజ్క్షతార తదితర మాస్టర్ల ఆధ్వర్యంలో వర్షశ్రీని స్వర్ణనంది అవార్డుతో సత్కరించారు. ప్రతిభ కనబర్చిన చిన్నారి వర్షశ్రీని డ్యాన్స్ మాస్టర్ నానితో పాటు తల్లిదండ్రులు, భూపాలపల్లి జిల్లా వాసులు అభినందించారు.