శివ శివ .. హర హరా…
– రామప్పలో ఇవేం పనులు..!?
– రామప్ప దేవాలయంలో విద్యార్థులకు మాంసాహార భోజనం
– యునెస్కో గుర్తింపు వచ్చినా పట్టించుకోని అధికారులు.
– అపవిత్రమవుతున్న ఆలయాలు..
– రామప్పలో పనిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు…
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : హిందువులకు పవిత్రమైన శివాలయా లను కొందరు అపవిత్రం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం సేవించడం నిషేధమైనా అవేమీ తమకు వర్తింవన్నట్లు ప్రవర్తి స్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉండడం తో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయంలో సోమవారం క్రిస్టియన్ స్కూల్ కు చెందిన విద్యార్థులకు గుడి ప్రాంగణంలో మాంసం వండి బహిరంగముగా వడ్డిoచి పెట్టారు. ఆలయ ప్రాంగణంలో భోజనం చేస్తున్న విద్యార్థుల్లో ఒకరు ఇక్కడ భోజనం చేయనంటూ చెప్తుంటే ఆ విద్యార్థిని ఉపాధ్యా యురాలు కొడుతున్నారని చూసిన భక్తుడు ఎందుకు కొడుతు న్నారో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. ప్లేట్లల్లో మాంసం ఉండడం చూసి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఇటీవలే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సాధించిన రామప్ప దేవాలయం లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పట్టించుకునే వారు లేకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామప్పలో అధికారుల మధ్య సమన్వయ లోపం…
రామప్ప దేవాలయంలో పనిచేసే అధికారుల మధ్య సమన్వయ లోపం ,ఒకరిపై ఒకరికి విద్వేషం ఉన్నట్లు గతంలో జరిగిన చాలా సంఘటనలు స్పష్టం చేశాయి. పురావస్తు శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ గార్డెన్ ప్రాంతంలో పనిచేసే ఫోర్ మెన్, ఇతర అధికారులకు ఎప్పుడూ సహకరించరు. వారిలో వారికి సైతం మేము అంటే మేమే గొప్ప అన్న రీతిలో పనిచేస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించడం తప్ప పర్యాటకులకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేసే వారు లేరనే అభిప్రాయాలు భక్తులనుంచి వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఒక శాఖ ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే మరో శాఖ పర్మిషన్ తీసుకోవాలనే రీతిలో ఉండటంతో ఎన్నోసార్లు గొడవపడ్డారు. అభివృద్ధి పనులకు ఒకరంటే ఒకరు అడ్డంగా ఉంటున్నారని ఆరోపించుకోవడమే వారి పనిగా ఉండేది. ఇక యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా అధికారులు, సిబ్బంది మారకపోవడంతో ఆలయ ప్రాంగణాల్లో తరచుగా అసాంఘిక కార్యకలాపాలకు, అపవిత్ర పనులకు నిలయంగా మారాల్సి వస్తోంది.
యునెస్కో గుర్తింపు రావడం ఇష్టం లేని వాళ్ళ పనేనా…
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఇష్టం లేని కొందరు అధికారులు ఉన్నారని ,వారే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. పురావస్తు శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందినవారు ఆలయంలో కి వచ్చే పర్యాటకులను కనీసం ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతించరని అలాంటిది మాంసాహారం వండుతున్నా ఎందుకు పట్టించుకోలేదో తెలియాల్సి ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులు, భక్తులను రామప్ప రామలింగేశ్వర స్వామి దర్శనానికి అనుమతిస్తారు. గతంలో ఇక్కడ పోలీస్ సిబ్బందిని రెండు శక్తులలో రాత్రిపూట సైతం ఆలయానికి రక్షణగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాపలాగా ఉంచేవారు. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ఆలయ పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండడం పట్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తప్పించుకునే మా పరిధి కాదని తప్పించుకునే అధికారులే తప్ప పని చేయాలనే ఆలోచన లేని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీ / సస్పెండ్ చేయడం చేస్తే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించా లని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.