కొత్త భవనంలోకి ఏపీజీవీబీ బ్రాంచ్ మార్పిడి

Written by telangana jyothi

Published on:

కొత్త భవనంలోకి ఏపీజీవీబీ బ్రాంచ్ మార్పిడి

– తీరనున్న ఖాతాదారుల కష్టాలు. 

వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వెంకటాపురం బ్రాంచ్ ను ఖాతాదారుల సౌకర్యం కోసం జగదాంబ థియేటర్ సమీపం లోని నూతన భవనంలోకి బ్యాంకును మార్పిడి చేసేందుకు అదికారులు సన్నహాలు ప్రారంభించారు. సుమారు పదివేల మందికి పైగా ఖాతాలు కలిగిన, ఏపీజీవీబీ బ్రాంచ్ లో ప్రతిరోజు బ్యాంకు పని వేళలో వందలు , వేల మంది ఖాతాదారులు బ్యాంకులో పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఖాతాదారులు వందల సంఖ్యలో రావడంతో భవనం హాలు సరిపోక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక భవనం రెండో అంతస్తు లో ఉండటంతో మెట్ల పై నుండి ఎక్కి ,దిగే వృద్ధులు, వికలాంగులు మధ్య వయస్కు లు, మహిళలు, వన్ వే మెట్లపై తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఇరుకైన భవనం పైగా వేల మంది ఖాతాదారులు కావడంతో, ఖాతాదారుల సౌకర్యార్థం ఏపీజీ వీబీ ఉన్నతాధికారు ఆదేశంపై జగదాంబ థియేటర్స్ సమీపం లోని నూతన భవనంలోకి మార్చేందుకు చకచక సన్నాహాలు పూర్తి చేశారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు, మేనేజర్, క్యాష్ కౌంటర్, ఫీల్డ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది విధులు నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లను నూతన భవనంలో ఏర్పాటు చేశారు. అలాగే క్యాష్ అండ్ గోల్డ్ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కూడా నూతన భవనంలో పనులు చక చక నిర్వహి స్తున్నారు. ఇప్పటికే ఏపీజీవీబీ నూతన బ్రాంచ్ బోర్టును కొత్త భవనంలో ఏర్పాటు చేశారు. 1977 వ సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా వాస్తవ్యులు స్వర్గీయ జలగం వెంగళరావు గారి ప్రభుత్వ హయాంలో తమ సొంత ఖమ్మం నల్గొండ జిల్లాలకు నాగార్జునసాగర్ బహుళార్ధ ప్రాజెక్టు నుండి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగునీటి మెఇన్ కాలువలను త్రవ్వించి, రెండు జిల్లాలలలో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో వేలాది ఎకరాల బీడు భూములు సైతం, నాగార్జున సాగర్ నీటితో సస్యశ్యామల మైంది. పసిడి పంటలు పండించే అన్నదాతల సౌకర్యం కోసం రైతులకు, ఖాతాదారులకు సేవలు అందించే నిమిత్తం, అప్ప టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళ రావు నాగార్జున గ్రామీణ బ్యాంకు పేరుతో ఖమ్మం, నల్గొండ జిల్లాలలో బ్రాంచీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నూగురు వెంకటా పురం మండల కేంద్రంలోని, వెంకటాపురం ప్రాథమిక పాఠశాల పక్కన వెంకటాపురం వాస్తవ్యులు అయిన భద్రాచలం పార్లమెంటు సభ్యులు గా పలుమార్లు విజయం సాధించిన స్వర్గీయ పార్లమెంటు సభ్యురాలు రాధా బా ఆనందరావు పెంకుటిల్లు లో నాగార్జున గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేశారు. అదే భవనంలో నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో వందల సంఖ్యలో ఖాతాదారులు నాగార్జున గ్రామీణ బ్యాంకు లో పంట రుణాలు, ఇతర బ్యాంకు సేవలను పొందారు. అనంతరం కాలక్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ లో, రెండు భవనాల్లో ఒక భవనం లో 12 సంవత్సరాలు, మరోభవనంలో 10 సంవత్స రాలు పాటు అద్దెభవనాల్లో బ్యాంకు ను నిర్వహించారు. అలాగే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా నాగార్జున గ్రామీణ బ్యాంకు పేరును, జాతీయ కరణలో భాగంగా గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు గా పేరు మార్చారు. ఈ మేరకు వాజేడు రోడ్డు లోని రెండో అంతస్తు భవనం లో 2007వ సంవత్సరంలో వాజేడు రోడ్ లోని రెండ వ అంత స్తు లోకి మార్చారు. అప్పటినుండి ప్రతి ఏడాది ఖాతాదారుల సంఖ్య పెరిగిపోతూ, ప్రస్తుతం పదివేలకు పైగా ఖాతాదారులు బ్రాంచిలో సేవలు పొందుతు న్నారు. డ్వాక్రా రుణాలతో పాటు, వ్యవసాయ రుణాలు, బంగారం ఇతర రుణాలను, ఈ బ్రాంచ్ నుండి ఉత్తమ సేవలు అందుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా నూతన భవనంలోకి బ్రాంచిని మార్పిడి చేసేందుకు బ్రాంచ్ ఉన్నతాధికారుల ఆదేశంపై ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తున్నారు. నూతన భవనంలో ఏర్పాటు చేస్తే ఖాతాదారులు ఇబ్బందులు తొలగి పోతాయని, ప్రస్తుతం ఉన్న బ్రాంచి భవనంలో నిలబడటానికి కూడా స్థలం లేకుండా పోయిందని, విశాలమైన భవనంలోకి అధికారులు బ్రాంచీ ని మార్పిడి చేయడం పట్ల వేలాది మంది ఖాతాదారులు ఏపీజీవీబీ అధికారులకు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a comment