ఊర కుక్కల దాడిలో గొర్రెలు మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడెంలో ఇంటి సమీప దొడ్డిలో ఉన్న గొర్రెల మందపై ఆదివారం రాత్రి ఊర కుక్క ల మంద దాడి చేయగా సుమారు 20 కి పైగా గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. మరి కొన్ని మేకలు, గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. గొర్రెల యజమాని నన్నే బోయిన తిరుపతి, ఇరుగు పొరుగు వారు మూగజీవాల ఆర్తనాదాలు విని వచ్చే లోగా జరగవలసిన నష్టం జరిగి పోయింది. గొర్రెలు, మేకలు పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబం కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెలను చూసి దుక్క సాగరంలో మునిగి పోయారు. లక్ష రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు భావిస్తు న్నారు. గాయపడ్డ మూగజీవాలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యం లో చికిత్స నిర్వహిస్తున్నారు.