నాణ్యమైన విద్యుత్ అందించడానికి సబ్ స్టేషన్ ఏర్పాటు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని రైతులకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి నూతనంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని శివాపురం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ 33 కెవి ఏర్పాటు చేసేందుకు అధి కారులతో కలిసి పరిశీలించారు. గతంలో చిన్నబోయిన పల్లి, వద్ద విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైనప్పటికీ అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పడంతో ఆ సబ్ స్టేషన్ ను శివాపూర్ లో నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు ఎందుకోసం సబ్ స్టేషన్ కావాల్సిన స్థల సేకరణ అనువైన స్థలాన్ని చిన్నబోయినపల్లి, శివాపూర్, గ్రామాలను పరిశీలిం చడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థానిక రైతులు ప్రజలు సహకరించాలి. ఈ కార్యక్రమంలో సీజీఎం కిషన్,ఎస్సీ మల్సూర్,డి ఈ నాగేశ్వరరావు, ఏ డి ఈ సుధాకర్, ఏఈ అశోక్, లైన్ ఇన్స్పెక్టర్ కొండా సమ్మయ్య, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్, గ్రామస్తులు, రైతు లు,తదితరులు పాల్గొన్నారు