వరికోత యంత్రాలకు నిర్ధిష్టమైన ధర నిర్ణయించాలి
– తహసీల్దార్ కు వినతి పత్రం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వరికోత యంత్రాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏ. ఎన్. ఎస్ మండల ఉపా ధ్యక్షులు కుంజ మహేష్ అన్నారు. వరి కోత యంత్రాల ధర అధికంగా నిర్ణయించారని, ఒక నిర్ధిష్టమైన ధర నిర్ణయించాల ని సోమవారం మండల తహసీల్దార్ లక్ష్మి రాజయ్య ను కలిసి మెమోరాండం అందజేశారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 2,600 టైర్ల మిషన్ కి, బురద చైన్ మిషన్ కి గంటకు రూ. 3,500 తీసుకుంటున్నారని తహసీల్దార్ కు తెలిపారు. మంగపేట, ఏటూరునాగారం, ఏడుల్లా భయ్యారం వంటి మండలాల్లో టైర్ల మిషన్ కి 1,700 వందలు ఎకరానికి, చైన్ మిషన్ కు 2,500 గంటకు ఇస్తున్నారని వివరించారు. వెంకటాపురం గిరిజన ప్రాంతంలో అధికముగా డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీని వల్ల రైతులకు తలకు మించిన భారం అవు తోందని వివరించారు. వరి కోత యంత్రాలకు సంబందించిన యజమానులను పిలిచి వారితో చర్చించి రైతులకు అందు బాటులో ఉందే ఒక నిర్ధిష్టమైన ధరను నిర్ణయించాలని తహ సీల్దార్ కు అంజేసిన వినతి పత్రంలో కోరారు. నిర్ధిష్ట ధరను నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ లక్ష్మి రాజయ్య స్పందిస్తూ సంబంధిత అధికారు లను యంత్రాల వారితో సమావేశ పరచి ధరల విషయం పైన చర్చించి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తా అని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసం నారాయణ, బాబు తదితరులు పాల్గొన్నారు..