ఐలాపూర్ సమ్మక్క సారక్క జాతర తేదీలు ఖరారు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలంలోని దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఐలాపూర్ లోని ఆదివాసీ ఆరాధ్యదైవం అయినటువంటి శ్రీ సమ్మక్క సారక్క జాతర తేదీలను బుధవారం నాడు అమ్మ వార్ల పూజారులు ఖరారు చేశారు. పూజారులు సంఘం అధ్యక్షుడు మల్లెల రవి ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ, పూ జారులు అమ్మ వార్ల గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సాంస్కృతి సంప్రదాయాల ప్రకారం జాతర తేదీలపై పెద్దలతో కలిసి చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజులు పాటు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షులు మల్లెల రవి మాట్లాడుతూ… 2025 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మహా జాతరను శ్రీ సమ్మక్క గుడి మెలుగు కార్యక్రమంతో పాటు, 12న సర్వాయి గ్రామం నుంచి శ్రీ సారాలమ్మ దేవత గద్దెకు వస్తుంది. 13న శ్రీ సమ్మక్క దేవత గద్దెకు వస్తుంది. 14న సమ్మక్క, సారాలమ్మ దేవతలకు మొక్కుబడులు సమర్పి స్తారు. 15న శ్రీ సమ్మక్క – సారాలమ్మ దేవతలు తిరిగి వాన ప్రవేశం చేస్తారని అన్నారు. ఈ మహా. ఈ మహా జాతరకు చతిస్గఢ్, పలిమల, వాజేడు, వెంకటాపురం తదితరులు మండలాల నుంచి భక్తులు వస్తారని, భక్తులకు అన్ని వస తులు కల్పి స్తామని మల్లెల రవి తెలిపారు.ఈ జాతరకు భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ తో మాట్లా డుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా రోడ్లు, కరెంటు, మౌలిక సదుపాయాల కల్పించాలని క్షేత్ర స్థాయిలో నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కోడె తిరుపతి, పీరీల భాస్కర్ గ్రామ యూత్ అధ్యక్షులు పీరీల సురేష్ తదితరులు పాల్గొన్నారు.