మోడల్ అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క.
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని జగ్గన్నపేట పంచాయతీ పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్ వాడి కేంద్రాన్ని, పుట్ట మల్లన్న గుడి దగ్గర బోరు మోటార్ ను మంగళవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం తో పాటు మన మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలు అవుతుం దన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే రోడ్డు పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారభించుకుందామని మంత్రి అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ, జిల్లా సంక్షేమ అధికారిని ప్రేమలత, ఎంపీటీసీ విజయ్, స్థానిక సీడీపీఓ స్వాతి, సూపర్ వైజర్ సరస్వతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ లు, ఆయాలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.