ప్లాస్టిక్ నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం…
– వెంకటాపురంలో విద్యార్థుల ర్యాలీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటాపురంలో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీ విద్యా ర్థులు సంయు క్తంగా, వెంకటాపురం పట్టణ ప్రధాన రహదారిపై ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధించుదాం , కాలుష్య నియంత్రణకు పాటు పడ దాం అంటూ నినాదాలు చేశారు. ఎ.కె. ఘణపూర్ మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు చౌలం శ్రీ నివాసరావు ఆధ్వర్యంలో , విద్యార్థుల ర్యాలీలో, కేజీబీవీ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. మహా కుంభమేళా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ల జాతర లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిద్దాం అని, నిత్య జీవితంలో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టుదాం అని, కాలుష్యం నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులు నినా దాలు చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం గిరిజన సంత కావడంతో సంతకు వచ్చిన ఆదివాసులకు, ప్రజలకు ప్లాస్టిక్ నిషేధం,వినియోగం వలన ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై మనం వెల్ఫేర్ సొసైటీ ఏకే ఘణపూర్ సభ్యులు అవగాహన కల్పించారు. మనం వెల్ఫేర్ సొసైటీ ఏకే ఘనపూర్ వ్యవస్థాపకులు చౌలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.