ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షునిగా కొమురవెళ్లి సతీష్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఆర్యవైశ్య మహా సభ ములుగు మండల అధ్యక్షునిగా కొమురవెళ్లి సతీష్ ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. శనివారం ములుగులోని శివాల యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకు న్నారు. మండల అధ్యక్షునిగా కొమురవెళ్లి సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా యాంసాని సురేష్, కోశాధికారిగా యాద సంపత్ లను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులందరినీ సంఘటితం చేసి ముందుకు వెళ్తామని, జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కులదైవ మైన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి గుడి గురించి కృషి చేస్తాన ని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసి యేషన్ జిల్లా అధ్య క్షుడు బాదం ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాజాపా జిల్లా కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి రమేష్, సభ్యులు పాల్గొన్నారు.