పండుగ తరహాలో ఏకరూపత ఆహారం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏకరూపత ఆహార ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయ డంలో భాగంగా డైట్ చార్జీలు కాస్మెటిక్ చార్జీలు పెంచిన సంద ర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం, దామరకుంట గురుకులాలలో పండుగ వాతావర ణం వేడుకలు నిర్వహించారు. కాటారం గిరిజన బాలుర కళాశాల నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథి గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గురుకుల అధికారి, ఓ ఎస్ డీ ఎల్. శ్రీనివాసులు నూతన మెనూని ఆవిష్కరిం చారు. ఆ తర్వాత సభా ధ్యక్షులు జయశంకర్ జిల్లా డి సీ ఓ, స్థానిక కళాశాల ప్రిన్సి పాల్ బీ.లాలు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు అందరూ పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించవచ్చని, వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులు పాటలతో ఆటలతో కొద్దిసేపు అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ లాలు మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలంటే ముందుగా వారు ఆరోగ్యంగా ఉండాలనీ, అందుకు సరైన రుచితో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ మరి యు కాస్మోటిక్ చార్జీలను గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా వారి మాటల్లో అప్పటికి ఇప్పటికి జరిగిన మార్పును గురించి వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గురుకులం అధికారి శ్రీనివాసులు మాట్లా డుతూ గురుకులంలో విద్యార్థి యొక్క పోరాటం ఉదయము 5 గంటల నుంచి మొదలవుతుందన్నారు. ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు తేడా వివరిస్తూ, ప్రభుత్వ సంస్థల్లో విద్యా ర్థి వ్యక్తిగతంగా సమాజాన్ని, పలు అంశాలను తెలుసుకుంటూ లీడర్ గా ఎదుగుతూ తను జ్ఞానాన్ని పొందుతాడని సవివ రంగా వివరించారు. మార్పు జరిగిన తీరు తరువాత గురుకు లాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరా లు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మన కళాశాల నుంచి పూర్వ విద్యార్థులు వారు ఎదిగిన విధానం వివరిస్తూ ఇక్కడి వసతులను సద్వినియోగం చేసు కొని విద్యార్థులు అందరూ చాలా చక్కగా చదువుకోవాలని సందేశం లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి లాలు, వైస్ ప్రిన్సిపాల్ హెచ్ రాజేందర్, జూనియర్ వైస్ ప్రిన్సి పాల్ ఏం మాధవి, డిప్యూటీ వార్డెన్ వెంకటరామిరెడ్డి, అధ్యా పక ఉపాధ్యాయ బృందం పీడీ మహేందర్, పీ ఈ టీ శ్రీనివాస, కోచ్ వెంకటేష్, పేరెంట్స్ కమిటీ సభ్యులు శారద, రమాదేవి, సురేందర్, జాడి శ్రీశైలం, జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు