సమన్వయంతో సరస్వతీ పుష్కరాలు నిర్వహించాలి

సమన్వయంతో సరస్వతీ పుష్కరాలు నిర్వహించాలి

సమన్వయంతో సరస్వతీ పుష్కరాలు నిర్వహించాలి

– వీడియో కాన్ఫరెన్స్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ 

– ప్రత్యేక యాప్ ద్వారా భక్తుల కు సమాచారం

– ప్రతిరోజు హారతి, సంగీత కార్యక్రమాలు

కాటారం , తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రివేణి సంగమం కాలేశ్వరం శైవక్షేత్రం లో జరిగే సరస్వతి నది పుష్కరాలను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విజయ వంతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పుష్కరాల సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, సరస్వతి పుష్కరాల ప్రాధాన్యతను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భక్తులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక యాప్ రూపకల్పన జరుగుతోందని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పుష్కరాల 12 రోజుల కార్యక్రమాల షెడ్యూల్‌ను ముందుగా రూపొందించి, ప్రతి రోజు జరిగే కార్య క్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. టెంట్ సిటీ ఏర్పాటుకు సంబంధించి పర్యాటక శాఖ ఎండి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి రోజు జరిగే హారతి, సంగీత కార్యక్ర మాలకు ప్రత్యేక ఇంచార్జ్‌లు నియమించాలని సూచించారు. ట్రాఫిక్ సునాయాసంగా కొనసాగేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక పుస్తకాలప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిపిఓ నారాయణ రావు, ఇరిగేషన్ ఈ ఈ తిరుపతి రావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, విద్యుత్తు శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, దేవస్థానం ఈఓ మహేష్, మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment