నాంచారమ్మ జాతరకు సహకరించండి

నాంచారమ్మ జాతరకు సహకరించండి

నాంచారమ్మ జాతరకు సహకరించండి

– ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు 

ములుగు,తెలంగాణజ్యోతి: ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుని సహకరించాలని ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు ప్రభుత్వ అధికారులను కోరారు. ఈమేరకు శుక్రవారం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకిని రాజు మాట్లాడుతూ వెంకటాపూర్ మండలం రామాంజాపూర్ శివారు లో కాకతీయులకాలంలో రామప్ప దేవాలయంతో పాటు నిర్మించ బడిన పంచకూటాలయాన్ని ఎరుకల నాంచారమ్మ దేవాలయం గా పిలుచుకుంటామన్నారు. 2017నుంచి ఐదు రాష్ట్రాల ఎరుక ల కులస్తులను ఏకంచేసి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నామని, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఆలయ పునర్ని ర్మాణం పేరుతో విప్పి కుప్ప పెట్టారని, ప్రభుత్వం స్పందించి ఎరుకల నాంచారమ్మ ఆలయానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా పనులు చేపట్టాలన్నారు. అంతకుముందు ములుగు లోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన సమావేశంలో లోకిని రాజు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఐటీడీఏ నుండి ఆదివాసి ఎరుకల కులస్తులకు సహకారం అందక అన్యాయం జరుగుతోందని, ఐటీడీఏలో తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు గురించి సమా చారం ఇవ్వడంలేదని, గిరిజన ఆదివాసి ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఎరుకలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజీకయ పరంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఎరుకల కులస్తులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న ములుగు జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఉత్సవ కమిటీ డైరెక్టర్లు కేతిరి బిక్షపతి, పల్లకొండ భాస్కర్, మేడ బంగారయ్య, పాలకుర్తి సురేష్, దేవర్ల పరమేష్, కేతిరి అశోక్, పాలకుర్తి ప్రమీల, కూరాకుల సరోజన, భూపాలపల్లి జిల్లా డైరెక్టర్లు కేతిరి సుభాష్, అంగిడి ప్రశాంత్, దేవరకొండ లక్ష్మణ్, సుల్తాన్ సుధాకర్, దుగ్యాల రామ్, సుల్తాన్ రవి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డైరెక్టర్లు మానుపాటి రమేష్, సురేందర్, గణేష్, ఓని సదానందం, దుగ్యాల రామ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment