మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
– పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : వచ్చే సంవత్సరం మే నెలలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలు నిర్వహణకు అధి కారులు అంచనాలు నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.శనివారం ఐడిఓసి కార్యాల యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహణపై రెవెన్యూ, దేవా దాయ, పంచాయతి రాజ్ సమాచార, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మత్స్యశాఖ అధికారులతో సరస్వ తి పుష్కరాల ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం కాళేశ్వరం లో మే 15వ తేదీ నుండి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే నెలలో నిర్వ హించే సరస్వతి పుష్కరాలకు అధికారులు తమ తమ శాఖ ల ద్వారా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లకు సంబంధించిన అంచనాలను తయారు చేసి నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశిం చారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక పారి శుధ్య కార్మికులను నియమించాలని డిపిఓ కు సూచించారు. గ్రామీణ మంచినీటి శాఖ ద్వారా పట్టంలోని ప్రధాన కూడళ్లు, గోదావరి, దేవాలయ పరిసర ప్రాంతాలలో సురక్షిత మంచి నీరు ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద తాత్కాలిక, శాశ్వత మరుగుదొడ్లు నిర్మించాలని తెలిపారు. భక్తులు స్నానాల కోసం నల్లాలు, మహిళలు బట్టలు మార్చు కునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలన్నారు. నిరం తర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికా రులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా కాలేశ్వ రంలో అంతర్గత రోడ్లు తాత్కాలిక రోడ్లు నిర్మాణాలు చేపట్టా లని ఆదేశించారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్ర మాలను నిర్వహించాలని డిపిఆర్వో ను ఆదేశించారు ఆర్ అండ్ బి ద్వారా ప్రధాన రహదారి ని మరమ్మతులు చేయా లని రోడ్డు ఇరువైపులా ముళ్ళ పొదలను తొలగించాలని ఆదేశించారు. ఆర్టీసీ ద్వారా వివిధ జిల్లాల నుండి భక్తులకు ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవలకు మహాదేవ పూర్,కాటారంలలో ప్రత్యేక రూములు అందుబాటులో ఉంచా లన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు నిబద్ధతతో పనిచేసి 12 రోజుల పాటు జరిగే పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. గత పుష్కరాల అనుభ వా లను దృష్టిలో ఉంచుకొని కాలేశ్వరంలో అన్ని ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,డిపిఓ నారాయణ రావు, డిపిఆర్వో శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈ ఓ మారుతి, తహసిల్దారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.