విద్యార్థులతో పనులు చేపిస్తున్న ఉపాధ్యాయులు..?
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను కూలీలుగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గిరిజన బాయ్స్ హాస్టల్ ఉపా ద్యాయులు చిన్నారులతో పనులను చేపిస్తున్నారు. గతంలో కూడా పలు పత్రికలో ఉపాద్యాయులు విద్యార్థులను కూలీ లుగా మార్చిన అనే శీర్షిక ప్రచురించినప్పటికి తీరు మార్చుకో ని వైనం. దీంతో ఉపాద్యాయుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీలతో చేయించాల్సిన పను లను విద్యార్థులతో పనులను చేయిస్తారా? అని మండి పడ్డారు. శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో చిన్న పిల్లలకు గొడ్డళ్ళను ఇచ్చి చెట్ల కొమ్మలను నరికి వేయా లని చెప్పుతున్నారట. విద్యార్థులతో పనులు చేయించడపై గత వారం క్రిందట పాఠశాల విసిటింగ్ కోసమని, ఓ విలేఖరి హెచ్ఎం దయాకర్ ను చరవాణిలో వివరణ కోరగా పర్మిషన్ లేనిది పాఠశాల లోపలికి వెళ్లకూడదని చెప్పారు. ఈ విషయంపై వెంటనే అధికారులు స్పందించి ఆ పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.