ములుగు మున్సిపాలిటీ బరిలో సకినాల భవాని
ప్రజల ఆశీర్వాదం కోరుతూ ప్రకటన
ములుగుప్రతినిధి,జనవరి17తెలంగాణజ్యోతి: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని తెలిపారు. శనివారం ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుని చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యమని అన్నారు. బీసీ బిడ్డగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీలకు ప్రతినిధిగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ములుగుజిల్లా, మున్సిపాలిటీఏర్పాటు కేసీఆర్ నాయకత్వం లో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, మహిళలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గతంలో తాను జడ్పీటీసీగా పనిచేశానని, తన తండ్రి దివంగత సకినాల శోభన్ కూడా జడ్పీటీసీగా ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు.






