వెంకటాపురంలో రైతే రాజు రైతు పండగ సమావేశం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో శనివారం ప్రజా విజయోత్సవాలలో భాగంగా రైతే రాజు రైతు పండగ కార్యక్ర మాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి పిఎసిఎ స్ చైర్మన్ చిడెం మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చిడెం మోహన్ రావు మాట్లాడు తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకునేందుకు 2 లక్షల రూపాయల బ్యాంకు రుణాల మాఫితో పాటు అనేక రైతు సంక్షేమ పథకాలు చేపట్టి రైతే రాజుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రశంసించారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, సన్న ధాన్యానికి 500 రూ. బోనస్ ప్రకటిం చిందన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని, ధళారీల బారిన పడకుండా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రంలో విక్రయించుకొని లబ్ధి పొందాలన్నారు.అలాగే రైతుల సౌకర్యం కోసం విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ పరికరాలు, విక్రయించేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు ప్రభుత్వమని రైతులకు ఏ విధమైన కష్టనష్టాలు వచ్చినా వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిం చడం జరుగుతుందని, దేశానికి వెన్నుముక అయిన రైతాంగ సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు సేవలందించేందుకు, సకాలంలో రుణాలు, ఎరువు లు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలను ప్రాథమిక సహకార సంఘం ద్వారా సేవలందిస్తున్నామని అన్నారు. ఆయా సొసైటీ సేవలను రైతు సోదరులు సద్విని యోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ చిడం మోహన్ రావు రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. రైతే రాజు రైతు పండగ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఆర్ వి వి సత్యనారాయణ సొసైటీ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.