నిమజ్జనం ఉత్సవాలలో నిబంధనలు పాటించాలి
– వినాయక నిమజ్జన ఊరేగింపులలో డిజె సౌండ్లు నిషేధం
– భక్తిశ్రద్ధలతో నిమజ్జనం పూర్తి చేయాలి
– ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి మండపాల వద్ద వినాయకుని నిమజ్జనాల ఊరేగింపులలో డిజే సౌండ్ సిస్టం లు ఉత్సవ కమిటీలు వాడరాదని ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. నిమజ్జన సమయాల్లో చెరువులు, కుంటలు నిండి ఉన్నందున నీటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఎవరైనా పోలీస్ ఉత్తర్వులను ఉల్లం ఘించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అన్నారు. మద్యం సేవించి ప్రజలు భక్తులు ఇబ్బంది పడే విధంగా ఎవరు కూడా ప్రవర్తించ వద్దన్నారు. ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద వినాయకుని నిమజ్జనం ఉత్సవాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.బ్రిడ్జి వద్ద నిమజ్జనం సమయంలో వాహనాలు ఒకటి తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో నిబంధనలు పాటించి నిమజ్జనం చేయాలి.నిమజ్జనం ఉత్స వాలు చిన్నపిల్లలు దూరంగా ఉండాలన్నారు.నవరాత్రి ఉత్స వ కమిటీలు భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని ఉత్సవ కమిటీలకు ఎస్ఐ తాజుద్దీన్ సూచించారు.