గ్రూపులుగా విడదీయడం మానుకోవాలి
– టీఎం అండ్ హెచ్ ఓ సి ఇ టి యు అధ్యక్షుడు గాదె రమేష్
ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు రెండు నెలల నుండి జీతాలు రావడంలేదనడం సరికాదని, రాక పోవడానికి అసలు కారణా లు తెలుసుకోవాలని కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా అసలు నిజాలు పక్కదారి పట్టే అవకాశం ఉందని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గాదే రమేష్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి జీతాలు చెల్లించక పోవాడానికి కారణం సదరు కాంట్రాక్టర్ నుండి ఎలాంటి బడ్జెట్ విడుదల కాకపోవడం అని ఆయన అన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ శానిటేషన్ సిబ్బంది జీతాలు రాక ఇబ్బంది పడవద్దని తమ కంట్రిబ్యూషన్ అమౌంట్ నుండి 3 నెలలు కార్మికులకు జీతాలు డి సి హెచ్ ఎస్ చొరవతో జూన్ వరకు సాలరీ అందించి అండగా నిలుస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పడినందున శానిటేషన్ సిబ్బందికి జీతాలు రావడంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ యూనియన్ నాయకు లం అందరం కలిసి సూపరిండెంట్ కు విన్నవించడం ద్వారా సానుకూలంగా స్పందించారని అన్నారు. సాలరీ విషయాన్ని కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. మా యూనియన్ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది మా మధ్యలో తగాదాలు సృష్టించి గ్రూపులుగా విడదీసే ప్రయత్నా లు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా నిజా నిజాలు తెల్సుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇంతవరకు బడ్జెట్ రిలీజ్ కాలేదని తెలిపారు. ఇలాంటి అస త్య ప్రచారాలను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ట్రేడ్ యూనియన్ నాయకులు తరపున ఖండిస్తు న్నామని గాదే రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎం డి ఫజల్, యూనియన్ నాయకులు వేణు, రమేష్, వెంకటేశ్వర్లు, విజయ్, రవి, కృష్ణ, సర్దార్, తిరు పతి, బాలు, ఉదయ్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.