ఏజెన్సీలో హల్చల్ చేస్తున్న రూ. 26వేల  బ్యాటరీ స్కూటర్

ఏజెన్సీలో హల్చల్ చేస్తున్న రూ. 26వేల  బ్యాటరీ స్కూటర్

ఏజెన్సీలో హల్చల్ చేస్తున్న రూ. 26వేల  బ్యాటరీ స్కూటర్

వెంకటాపురం నూగూరు. తెలంగాణ జ్యోతి : పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఎటువంటి కాలుష్యం లేని 26 వేల రూపాయల విలువైన బ్యాటరీ స్కూటర్ ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతం లో రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి. గ్రీన్ కంపెనీ సంస్థ వీటిని సుమారు 30 కిలోమీటర్ల వరకు నడిచే విధంగా రూపొందించి కేవలం రూ.26వేలకే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. స్కూటర్ను 25 కిలోమీటర్ల స్పీడుతో నడప వచ్చు. సీనియర్ సిటిజన్లు , యువత, మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే వీదంగా గ్రీన్ సంస్థ 26 వేల రూపాయలకే విక్రయిస్తుండటంతో, బ్యాటరీ స్కూటర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు వెంకటాపురం వాస్తవ్యులు రైతు, ప్రముఖ న్యాయవాది బాహు బలేంద్రుని నటరాజ పూర్ణచంద్రరావు కుటుంబం ఈ బైక్ ను కొనుగోలు చేసి  కుటుంబ అవసరాలకు వినియోగిస్తు న్నారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై గ్రీన్ బైక్ పై వెళ్తుండగా తాము కూడా కొనుగోలు చేయాలని  పలుువురు చర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment