ఆశ్రమ పాఠశాలలో పిచ్చి మొక్కల తొలిగింపు
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కూలీలతో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కోటయ్య మాట్లాడుతూ చెట్లు కొమ్మలు భవనం పైకి వస్తున్నా యని, చెట్ల కొమ్మల ద్వారా విషసర్పాలు వచ్చే అవకాశం ఉందని, విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తు గా నరికివేస్తున్నామని తెలిపారు.రాత్రి సమయంలో పాఠశాల ప్రక్కన ఉన్న గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు అయ్యేవి. చెట్లను తొలిగించడంతో ఉపాద్యాయులను స్థానిక కాలనీ వాసులు అభినందించారు.