విద్యుత్ ఏఈగా పదోన్నతి పొందిన ములుగు వాసి
ములుగు ప్రతినిధి : ములుగుకు చెందిన బానోతు రవి సబ్ ఇంజినీర్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ గా పదోన్నతి పొందారు. చిన్నప్పటి నుంచి ఒడిదొడుకులు ఉన్న పట్టుదలతో చదువు కొని పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రవి విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్ గా పనిచేశారు. ములుగు లో అసిస్టెంట్ ఇంజినీర్ గా పదోన్నతి పొందిన బానో తు రవిని స్థానిక బంజారాసంఘం నాయకులు అభినందించారు.బంజా ర బిడ్డ అయిన రవి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరి న్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. పదోన్నతి పొందిన రవికి శుభాకాంక్షలు తెలిపారు.