భక్తులతో కిటకిట లాడిన దేవాలయాలు
– నాగులమ్మ పుట్టల వద్ద భక్తుల సందడి
– కార్తీకదీపం తో భక్తి రస సందడి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : కార్తీక పౌర్ణ మి సందర్భంగా ములుగుజిల్లా వెంకటాపురం, వాజేడు మండ లాల్లో శుక్రవారం నాగులమ్మ పుట్టల వద్ద, పుట్టకలుగుల్లో ప్రసాదాలు జారవిడిచి భక్తిశ్రద్ధలతో పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. గ్రామ శివారులో ఉన్న పుట్టల వద్ద, వేకువ జామునే భక్తులు పెద్ద సంఖ్యలో ఆవు పాలతో నాగులమ్మకు ఇష్ట ప్రసాదాలను జార విడిచారు. అలాగే దేవాలయాల్లో వేకు వ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక దీపోత్సవం లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి వున్న శ్రీఉమారామ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేలాది మంది భక్తులు క్యూలు కట్టారు. అలాగే పసుపు కుంకాలతో కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అభయాంజనే య స్వామి వారి మందిరాలుతో పాటు మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయాల వద్ద, శ్రీ గణేష్ మహారాజ్ మందిరం, శ్రీ రామ టెంపుల్, ఇంకా అనేక దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు నిర్వహిం చారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారి మాల ధారణ భక్తులు, శ్రీ అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులు, భవానీ భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రమైన కార్తీక పౌర్ణమిని ఘనంగా భక్తి రస పూజలతో పునీతులయ్యారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటాపురం లోని శివాలయం వద్ద భక్తులతో జాతరను తలపించింది.