Ration card | కొత్త రేషన్ కార్డులపై స్పష్టత
– అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరించాలని ఆదేశించిన సీఎం
డెస్క్ : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ శుభవార్త ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివా లయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులం దరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మం త్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర లను ముఖ్యమంత్రి ఆదేశించారు.