గ్రామ సమస్యలు పట్టని జి పి కార్యదర్శులు

గ్రామ సమస్యలు పట్టని జి పి కార్యదర్శులు

గ్రామ సమస్యలు పట్టని జి పి కార్యదర్శులు

– పట్టణ ప్రాంతాల్లో నివాసం.

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఇటీవల కురిసిన భారీ వర్షాలు గోదావరి వరదలు తో గ్రామాల్లో అపరి శుభ్రత వాతావరణ ఏర్పడిందని మురికి కాలువలు డ్రైనేజీ లు శుభ్రం చేసే నాధుడే లేడని, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటు లో లేకుండా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆరోపించింది. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక లో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ముఖ్య కార్యకర్తల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం వెంకటాపురం మండ ల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు మాట్లాడుతూ, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పే పాలకులు గ్రామాలలో అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే సామెత లాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో భారీ వర్షాలతో,వరదలతో మురికి కాలువలు, మురుగునీరు రోడ్లపై వీధులపై పారుతున్నాయన్నారు. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. మలేరియా ,డెంగ్యూ మహమ్మారి శానిటేషన్ చేయాలని కోరారు. అపరిశుభ్రత కార ణంగా దోమలు కారణంగా జ్వరాల కేసులు పెరిగిపోతున్న, పారిశుథ్యం లోపం గురించి పంచాయతీ అధికారులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడ చల్లటం లేదని ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గ్రామాలలో దోమలు విపరీతంగా దాపరించడం వల్ల సాయంత్రం అయితే ఇంటా, బయట నిలబడే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లితే వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు నని అన్నారు. గ్రామపంచాయతీలలో కొందరు కార్యదర్శిలు గ్రామాలకు వచ్చామా, వెళ్ళామా అన్నట్లుగా వ్యవహరిస్తు న్నారని వాపోయారు. వెంకటాపురం మండల ప్రజా పరిషత్ అధికారి మండల పరిధిలో గ్రామపంచాయతీ లలో పర్యటిం చకపోవడం వల్ల, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ఆదాయాన్నిచ్చే వివిధ రకాల వేలం పాటలు ఏర్పాటు చేయక పోవడం వల్ల, ఆ గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయం తగ్గిపోయి గ్రామ పంచాయతీ పరిధిలో నిధులు లేకుండా ఉన్నాయని అన్నారు. నిధులు లేక మురికి గుంటల్లో బ్లీచింగ్ చల్లకుండా వీధిలైట్లు పెట్టని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు చొరవ చూపాలని ఏ ఎస్ పి డిమాండ్ చేసింది. సమావేశంలో నాయకులు సూరి బాబు, ప్రశాంత్, రాజు ,మహేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment