కన్నుల పండువగా రాములోరి కళ్యాణం
– ములుగులో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
– శ్రీ క్షేత్రంలో మహా అన్నదానం
ములుగు, తెలంగాణ జ్యోతి : కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా ములుగు జిల్లా వ్యాప్తంగా జరిగాయి. ములుగులోని మారుతీనగర్ లోగల శ్రీ సీతారామాంజనేయస్వామి (శ్రీక్షేత్రం) ఆలయంలో అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నవమి వేడుకలు వైభవంగా నిర్వహిం చారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి శేషాచార్యులు సీతారాముల కళ్యాణ తంతు నిర్వహించగా వేలాదిమంది భక్తులు తరలివచ్చి మహోత్స వాన్ని తిలకించారు. లోక కళ్యాణార్థం ప్రతీ ఏడాది నవమి సందర్భంగా సీతారామ కళ్యాణమహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో చల్లగా జీవించేందుకు అనదిగా వస్తున్న వేడుకలని పేర్కొన్నారు. అయోధ్యలో 500ల ఏళ్లనాటి కళ సాకారం చేసుకొని భవ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని మొదటి సారి నవమి వేడుకలను నిర్వహించుకోవడం భారతీయులకు వరమన్నా రు. బాలరాముని ప్రతిష్ఠించుకున్న తొలి ఏడాది నిర్వహించుకున్న నవమి వేడుకలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నవని పేర్కొన్నారు. శ్రీ క్షేత్రంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పలువురు దాతలు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200లమంది రామ భక్తులు స్వచ్ఛందంగా రాములవారి కళ్యాణ మహోత్సవ సేవలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, వారందరికీ ప్రత్యేకంగా ఆలయ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ కృతజ్క్షతలు తెలిపారు. సాయంత్రం సీతా రాముల ఉత్సవ విగ్రహాలను డీజే శబ్ధాల నడుమ, భక్తుల రామనామ కీర్తనలతో ములుగు పురవీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్, తోట తిరుపతి, కొత్తపల్లి బాబురావు, సలుపాల శ్రీనివాస్, కాపిడి సంపత్, సుతారి సతీష్, కటుకు రాంచందర్ రావు, బోల్ల అనిల్ కుమార్, బైకాని సాగర్, బైకాని రాజు, ఓదెల రమేష్, గుండేవెన రమేష్, గుర్రం సాయి, గై గోపి, ఇమ్మడి రమేశ్, శీలం రాము, ఒజ్జల లింగన్న, శంకేశి జగదీష్, నూనె బిక్షపతి, శీలం వేణు, కొత్తకొండ రమేష్, భూషవెన రమేశ్, బండారి కుమార్, గై మల్లయ్య, జెళ్ళ కొమురయ్య, పోషమ్మల కుమార్, తదితరులు పాల్గొన్నారు. ములుగు పట్టణ కేంద్రంలోని సుమారు 2000 మంది రామభక్తులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.