వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని మహ్మద్ గౌస్ పల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ సేవాసమితి ఆద్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువును నిమ్మ టూరు శ్రీనివాస్ శర్మ జరిపించగా, మేకల ప్రశాంత్,కోలా కోటి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని సుంకరి రాజు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు,బండారి రాజ్ కుమార్ ,తోట రాజు, కుడుతాలరమేష్, తరాల అవినాష్, దామరకొండ రాజు, గండ్రత్ శ్రీధర్,గుర్రాల కృష్ణారెడ్డి, మెట్ల రాకేష్,గందే వంశీ, వరుణ్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.