Ramappa | రామప్పలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి వేలం పూర్తి
– రూ.5.20లక్షలు ఆదాయం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటా పూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరి కాయ లు,పూజా సామాగ్రి అమ్మేందుకు మంగళవారం ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజాసామాగ్రి అమ్ముకునేందుకు వేలంపాట ద్వారా రూ. 5,20,500 ల ఆదాయం వచ్చినట్లు రామప్ప ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిశీలకులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా దుగ్గొండి కి చెందిన జనగం రమేష్ అధిక ధరకు వేలం దక్కించుకున్నారు. గత ఏడాది రూ.4.31లక్షలు వేలంలో లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాంబారావు, అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్, దేవాలయ సిబ్బంది అవినాష్, జి.సంతోష్, దామోదర్, రత్నకుమారి, గ్రామస్తులు శ్రీనివాస్, కన్న మల్లయ్య, వకులాభరణం, తదితరులు పాల్గొన్నారు.