రాజకీయాధికారంలో ముదిరాజ్ లకు రిజర్వేషన్లు ఉండాలి

Written by telangana jyothi

Published on:

రాజకీయాధికారంలో ముదిరాజ్ లకు రిజర్వేషన్లు ఉండాలి

– తెనుగొల్లను బీ సీ ‘ఏ’ లో చేర్చాలి

– కార్పొరేషన్ కు ఏటా వెయ్యి కోట్లు రూ. కేటాయించాలి

– మత్యకారులకు ఆసరా పింఛను ఇవ్వాలి

– ముదిరాజులకు గురుకులం ఏర్పాటు చేయాలి

–  ముదిరాజ్ మహాసభ డిమాండ్

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : తెలంగాణలో అత్యంత ప్రాచీన అధిక జనాభా గల కులమైన ముదిరాజ్, తెనుగోల్లు, ముత్తరాశి పేర్లతో ఎన్నో ఏళ్లుగా సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ నాగరాజు కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రాంతంలో 2014 ఆగస్టు 18, 19 తేదీలలో చేసిన సకుటుంబ సర్వే ప్రకారంగా తెలంగాణ జనాభాలో దాదాపు 13 శాతం ముదిరాజ్ కులస్తులు ఉన్నారని వారు పేర్కొన్నారు. కొంతమంది మత్స్యవృత్తిని, తోటల పెంపకం, ఇతర వృత్తులపై జీవనం కొనసాగిస్తున్న ముదిరాజుల జీవితాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అభయహస్తం కొంతమేరకు తమకు విశ్వాసాన్ని కలిగించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంగా మరికొన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. అభయ హాస్థం లో పేర్కొన్న హామీ ప్రకారంగా జీవో 15 తేదీ 19 ఫిబ్రవరి 2009 ప్రకారం గా ముదిరాజ్, ముతరాసి, తెనుగోళ్లు కులాలను బీసీ డీ నుంచి బిసి ఏ లోకి పునరుద్ధరణ చేసి, తక్షణమే దానిని ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించాలని వారు కోరారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందుకు ముదిరాజ్ మహాజనసభ ధన్యవాదాలు తెలిపింది. ఈ సొసైటీకి ఏటా 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించా లని వారు కోరారు. చెరువు, కుంటలపై మత్స్య సంపదపై తెనుగు, ముత్తరాశి, ముదిరాజ్, బెస్త, గంగపుత్ర, గుండ్ల కులాలకు హక్కులు ఉండే విధంగా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేసి, 75 శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని అలాగే తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి దానికి ముదిరాజు కులాస్తులని మాత్రమే చైర్మన్ గా నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ మత్స్య కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కు వెంటనే ఎన్నికలు జరిపి, చైర్మన్, పాలకమండలని నియమించాలని వారు కోరారు. 50 ఏళ్లు పైబడిన వారికి చేనేత కార్మికులకు, గౌడ కులస్తులకు, ఇచ్చినట్లుగానే ముదిరాజ్ మత్స్య కారులకు కూడా ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు విద్యలో వెనుకబడి ఉన్న కారణంగా ముదిరాజుల కోసం ప్రభుత్వం ప్రత్యేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం వంద శాతం మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలి అని వారు కోరారు. రాజకీయ రంగంలో ముదిరాజు ప్రాతినిధ్యం పెంచడానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలో మూడు స్థానాలు, రాజ్యసభలో ఒక స్థానాన్ని , పది శాతం కార్పొరేషన్ లో ముదిరాజులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ గా నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు జోరుగా సదయ్య మండల అధ్యక్షులు ఓలపు రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, జిల్లా ఉపాధ్యక్షులు చాలా కిష్ట స్వామి, జిల్లా ముఖ్య ప్రమోటర్ ఫని, జిల్లా ఉపాధ్యక్షులు జోడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి చింతల రమేష్, జిల్లా అధికార ప్రతినిధి నాయిని శ్రీనివాస్, నాయకులు జోడు సత్యం, ఓలపు శ్రీనివాస్, అట్టెం రాజు, సిరిసిల్ల నరేష్, తోటి మనోహర్, నాయిని మదనక్క, శీలం సరోజన, శీలం రాకేష్, బొంతల సంతోష్, సిరిసిల్ల సుమన్, సిరిసిల్ల ప్రసాద్, జోడు రాజయ్య, జీయర్ మల్లయ్య, జీయర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now