బారికేడ్స్, హెచ్చరిక బోర్డులు ములుగు జిల్లా పోలీసులకు అందజేత
– జిల్లా ఎస్పీ డా. శబరిష్ కు అందించిన ఎం పి ఎల్ బ్రాండింగ్ మేనేజర్ కార్తీక్ గౌడ్.
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం జాతర సందర్భంగా ప్రజల భద్రత దృష్ట్యా మరియు ట్రాఫిక్ నియంత్రణ కొరకు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టీల్ పైప్స్ కంపెనీ మహాలక్ష్మి ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6 లక్షలు విలువ చేసే 50 బారికేడ్స్, రూ. 2 లక్షల విలువ చేసే 3వేల హేచ్చరిక బోర్డ్స్ ను ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ కి కంపెనీ ప్రతినిధి పి. కార్తిక్ గౌడ్ బ్రాండింగ్ మేనేజర్ మేడారం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ వద్ద అందజేశారు. కంపెనీ సేవలకు ములుగు ఎస్. పి శబరీష్ ఎం. పి. ఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్, ములుగు డి ఎస్ పి రవీందర్, సి ఐ పస్రా శంకర్, ఆర్ ఐ సంతోష్, ఎం పి ఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు.