అంగన్వాడి కేంద్రం భవనంలోకి ప్రవేశించిన వర్షపు నీరు

Written by telangana jyothi

Published on:

అంగన్వాడి కేంద్రం భవనంలోకి ప్రవేశించిన వర్షపు నీరు

– మోకాలి లోతు నీటిలో అంగన్వాడి భవనం

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పూసురు గ్రామంలో గత రెండు రోజు లుగా కురిసిన అతి భారి వర్షాలకు గ్రామంలోని అంగన్వాడి సెంటర్ జలమయం అయింది. ఈ దృశ్యం చూసినట్లయితే అంగన్వాడి సెంటర్ నిండు కుండలా ఉన్న చెరువుల ను తలపిస్తుంది. అంగన్వాడి సెంటర్ లో చిన్నారులు , శిశువుల నుండి, ఐదు సంవత్సరాల పిల్లలకు, గర్భిణి స్త్రీలకు, బాలింత లకు, పౌష్టిక ఆహారాన్ని అందించే అంగన్వాడి కేంద్రం ఇలా ఉందని వారికి అంగన్వాడి సేవలను ఏవిధంగా అందిస్తామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి పిల్లలు అంగన్వాడి సెంటర్ కు రాలేక అనేక ఇబ్బందులు పడుతు న్నారని, ప్రభుత్వం స్పందించి శాశ్వతమైన పరిష్కారం చేయాలని పూసూరు గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Leave a comment