న్యాయవాదులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

Written by telangana jyothi

Published on:

న్యాయవాదులపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

– ములుగు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన

ములుగు ప్రతినిధి : జనగామ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు గురించి వెళ్లిన న్యాయవాద దంపతులపై దాడిచేసి దూషించి న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ములుగు బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు మస్రగాని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఓ కేసు పరిష్కారం కోసం వెళ్లినన్యా యవాద దంపతు లు గద్దల అమృతరావు, కవితలపై జనగామ సీఐ, ఎస్సై, ఏఎస్సైలు దాడిచేసి దుర్బాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయ వాదులపై దౌర్జన్యం చేస్తున్న పోలీసులపై సుమోటోగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కె.సునీల్, సీనియర్ న్యాయవాదులు వై.నర్సిరెడ్డి, ఎం.వెంకటేశ్వర్రావు, బి.చంద్రయ్య, ఆర్.భిక్షపతి, కె.రవీందర్, ఎస్.చిరంజీవి, బి.ప్రతాప్, ఎం.అశోక్, ఓ రాజేందర్, విజయ్ కుమార్, మన్సూర్ అలీ, సురేష్, సీహెచ్.రాజేందర్, లింగ మూర్తి, ప్రణయ్, సంజీవ, అర్చన, నవత, రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment