వెంకటాపురంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

– కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. 

తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం ఆవరణలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, నాయకులు బాలసాని వేణు, యువజన కాంగ్రెస్ నాయకులు నాని ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు, రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment