కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కి ఘనస్వాగతం పలికిన నర్సంపేట బిజెపి నాయకులు
తెలంగాణ జ్యోతి, దుగ్గొండి : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కి బుధవారం నర్సంపేట బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీ గా ఘన విజయం సాధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి గా నియమితులై పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కు విచ్చేసిన బండి సంజయ్ కి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ,నర్సంపేట నియోజకవర్గ నాయకులు డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రభ బండ్లతో ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్స్, ఇంచార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.