కాటారంలో పలువురిని పరామర్శించిన పుట్ట మధూకర్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండలం లో పలు గ్రామాలలోని కుటుంబాలను మంథని మాజీ ఎమ్మె ల్యే, పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామ ర్శించారు. ఇటీవల కాలంగా కొంతమంది అనారోగ్యానికి గురి కాగా వారిని పరామర్శించి భరోసా కల్పించారు. అలాగే మరి కొంత మంది అకాల మృత్యువాత పడిన కుటుంబాలను పరా మర్శించారు. ఆయన వెంట కాటారం మండల బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్చార్జి జోడు శ్రీనివాస్, నాయకులు ఊర వెంకటేశ్వ రరావు, జక్కు శ్రావణ్, కోడపర్తి రవి, గాలి బాపు తదితరులు ఉన్నారు. కొత్తపల్లి గ్రామం ఇటీవలే మృతి చెందిన బోగిరి ప్రవ ళిక కుటుంబాన్ని పరామర్శించారు. పాగే మల్లయ్య అనారో గ్యంతో బాధపడుతుండగ వారిని పరామర్శించారు. కోట రాజయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరా మర్శించి, భరోసా కల్పించారు. నస్తూర్ పల్లి లో మెరిజాల వెంకటయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకరం పల్లి లో కందికొండ వైష్ణవి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. పోత శ్రావణ్ కంటి ఆపరేషన్ చేయించుకోగా వారిని కలిసి, బాగో గులను విచారించారు.