వెంకటాపురం – చర్ల రోడ్డు మరమ్మత్తులు చేయాలి
– ఇసుక లారీలను నియంత్రించాలి.
– దుమ్ముధూళీ అరికట్టాలని రాస్తారోకో.
వెంకటాపురం నూగూరు,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి న వెంటనే మరమ్మతు చేయాలని, ఇసుక లారీలను నియంత్రించాలని, దుమ్ముదూలి లేవకుండా నీళ్లు చల్లాలని డిమాండ్ చేస్తూ శనివారం వెంకటా పురం మండల కేంద్రం శివాలయం వద్ద గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. భద్రాచలం నుండి వెంకటాపురం ప్రయాణించా లంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవ త్సరాల పైగా అయినా నేటికీ రోడ్డు మరమ్మత్తులు పూర్తిచేయ చేయలేదన్నారు. కాంట్రాక్టర్ అర్ధాంతరంగా వదిలేయడంతో లారీల కారణంగా రోడ్లు గోతులమయమై ప్రయాణాలు చేయ డానికి వీలు లేకుండా పోయిందని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ ప్రాం తానికి రావాలంటేనే ప్రజలు హడలెత్తి పోతున్నా రనీ దీనికి తోడు వందలాది ఇసుక లారీలు రాకపోకలు సాగి స్తుండటంతో పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ము దూళి కారణంగా రహదారి కి ఇరు వైపుల ఉన్న గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతు న్నారని, కంటి జబ్బులు సమస్యలు వస్తున్నాయని, నరక యాతన అనుభవిస్తున్నామని వెంటనే పరిష్కరించాలని ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో సందర్భంగా ఇరు వైపులా వందలాది వాహనాలు ఇసుక లారీలు నిలిచి పోయా యి. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం పోలీస్ స్టేషన్ అధికారి, పోలీస్ సిబ్బంది అక్కకడికి చేరుకొని వారితో చర్చలు జరిపారు. రోడ్డు సమస్యను ఉన్నతాధికారులకు తెలి యపరుస్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం తో రాస్తారోకో విరమించారు.