లక్ష్మీదేవిపేటలో సమ్మక్క సారలమ్మలకు పూజలు
వెంకటాపూర్ : మండలంలోని లక్ష్మీదేవి పేటలో గద్దెలపై గురువారం సమ్మక్క, సారలమ్మ లు కొలువుదీరగా సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి దుర్గం సంపత్ ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ మా పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం వన దేవతలను కొలుచుకోవడం జరిగిందన్నారు. దుర్గం మల్లయ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ దుర్గం సూరయ్య ఆధ్వర్యం లో వనదేవతలకు ఘనంగా మొక్కులు సమర్పణ కార్యక్రమం జరిపించామని తెలిపారు. లక్ష్మీదేవిపేట పరిసరాలలో పెద్ద మాటనుండి వనాన్ని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టాపన అనం తరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాలలో దుర్గం కుటుంబ సభ్యులతో పాటు భక్తులు గ్రామస్తులు పాల్గొని మొక్కలు అప్పజెప్పారు .