జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలి
– ఎస్పి కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : నేటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ, ప్రజలు ప్రశాంత వాతావరణం లో దరఖాస్తులు పెట్టుకునేలా భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనకు సంబందించి పోలీస్ బందోబస్తు, ప్రజా పాలన నిర్వహణ తీరును జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ, రాంనగర్ మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎస్పి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా అర్హులైన ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి కిరణ్ ఖరే కోరారు.
1 thought on “జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలి”