శ్రీ బీరమయ్య జాతరకు ముమ్మర ఏర్పాట్లు

శ్రీ బీరమయ్య జాతరకు ముమ్మర ఏర్పాట్లు

శ్రీ బీరమయ్య జాతరకు ముమ్మర ఏర్పాట్లు

– శనివారం నుండి సోమవారం వరకు మూడు రోజులు జాతర

– తరలిరానున్న వేలాది మంది భక్తులు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ఛత్తీస్గడ్ సరిహద్దు లోని తెలంగాణ రాష్ట్రం లొటు పిట గండి వాగు కొండలపై వెలసిన అపర భీష్మా శంకరుడు శ్రీ భీరమయ్య జాతర శనివారం నుండి ప్రారంభం కావడంతో, ఆలయ కమిటీ ఉత్సవ కమిటీలు టేకులగూడెం గ్రామస్తులు విస్తృత ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ప్రతి ఎడాది జరిగే శ్రీ బీరమయ్య జాతరకు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు, సరిహద్దులోని చతిస్గ్ డ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అందులో భాగంగా కొండలపై వెలిసిన శ్రీ బీరయ్య గుడికి వెళ్లేందుకు కొండలు ఎక్కి నడిచి వెళ్ళే భక్తుల సౌకర్యం, దారులను,బాటలను శుభ్రం చేశారు. అలాగే గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు కూడా రేవులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీరమయ్య జాతర వద్ద మూడు రోజులు పాటు ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఇరువైపులా జాతర కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మేరకు వందలాది మంది వ్యాపారులు పందిల్లు, టెంట్లు వేసుకొని ఫ్యాన్సీ, బొమ్మలు వివిధ రకాల వస్తువులు విక్రయించు కునేందుకు నాలుగు రోజుల ముందుగానే ఏర్పాటు లు గావించారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు యాలంఅచ్చయ్య, టేకులగూడెం గ్రామ సర్పంచ్ వాసం కృష్ణవేణి ఆధ్వర్యంలో భక్తుల కమిటీలు, టేకులగూడెం భక్తులు , భీరమయ్య జాతర ను విజయవంతం చేసేందుకు, రేయింబవళ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉదయం నుండి పూజా కార్యక్రమాలు, భక్తుల మొక్కు బడుల సందడి తో, అభయారణ్యం, లోటుపిట గండి వాగు, జాతీయ రహదారి భక్తులు, వేలాది వాహనాలతో మూడు రోజులు పాటు, ఇసుక వేస్తే రాలనంత భక్తుల సందడితో, జై భీరమయ్య, జై జై బీరమయ్యా అంటూ భక్తుల జై జై ధ్వానాలతో స్వామివారి నినాదాలతో అభయారణ్యం ,భక్తి రస కార్యక్రమాలతో మారుమోగుతున్నది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment