కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యొతి : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాలపై ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞా కార్యక్రమాలు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావించాలని, కుల,మత ప్రాంత, వర్ణ, లింగ, ధనిక పేద ఎలాంటి బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు భారత రాజ్యాంగంలో కల్పించబడిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రాథమిక సహకార సహకార సంఘం చైర్మన్ చిడెం మోహన్ రావు ప్రతిజ్ఞ కార్యక్రమంలో అన్నారు. ఈ మేరకు మండలంలోని వెంగళరావు పేట, వి ఆర్ కె పురం చొక్కాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం జై బాపు , జై భీమ్, జై సంవీథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాలువ సుందర్,ఎస్.సీ. సెల్ అధ్యక్షుడు సాధనపల్లి శ్రీ నివాసరావు , శ్రీరాముల రమేష్, సుంకర రంగయ్య నాయుడు, మంచాల భూషణం, గుండమళ్ళ కిరణ్, ఇంకా పలువురు నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సోదరీమణులు ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్నారు.