మంగపేట ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
మంగపేట, తెలంగాణ జ్యోతి : మంగపేట మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ముంద స్తు సంక్రాంతి సంబరాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగిమంటలు ఏర్పాటుచేసి, రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సంబరాలలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొ న్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోదెం మేనక మాట్లాడుతూ సంక్రాంతి అనేది సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల జరిగే మకర సంక్రమణ రోజునే మకర సంక్రాంతిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారన్నారు. పండుగలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యతను, విశేషాన్ని తెలియ చేయడానికి సందర్భోచితంగా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి,సామ్రాజ్యం, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం వెంకటస్వామి ఉన్నత, ప్రాథమిక పాఠశాల ఉపాద్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గొందిగూడెం పాఠశాలకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ పంపిణి
మండల పరిధిలోని గొందిగూడెం ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారిని పోదెం మేనక సందర్శించి పాఠశాలలో ఉన్న 20 మంది విద్యార్థులకు రూ.5 వేల విలువైన స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్ లను నరసింహసాగర్ గ్రామానికి చెందిన ఈడ్పుగంటి దేవేందర్ ఆర్థిక సహకారంతో అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీపాఠశాలల అభివృద్ధి కి దాతలు సహకరించి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. విరాళం అందించిన దేవేందర్ కి మండల విద్యాశాఖ తరపున, పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల ఉపాధ్యాయులు సూక్య, గ్రామానికి చెందిన శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.