పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి
– రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్.
కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు, మహా కుంబాబిషేకం, ఆలయ అభివృద్ధి పనులపై లైన్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈఓ కార్యాలయంలో ఏర్పాట్లపై సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాలు విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వచ్చే నెల 7 వతేది నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు మహా కుంబాబిశేఖం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్ని ఏర్పాట్లు చేయా లని సూచించారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరా లకు 19 డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అన్ని శాఖల సమన్వయంతో పని చేసి భక్తులకు అన్ని సౌకర్యా లు కల్పించాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి సుమారు రోజుకు 50 వేల మందికి పైగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, వన్ వే రూట్ ఏర్పాటు చేసి సూచిక బోర్డ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అన్ని డిపోల నుంచి ప్రత్యేక బసు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. రూరల్ వాటర్ శాఖ ద్వారా ద్వారా సురక్షిత మంచి నీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి నది పరిసరాల లో మహిళలు బట్టలు మార్చుకునేందుకు కొన్ని శాశ్వత గదులతో పాటు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, జన సందోహం ఉండే చోట చలువ పందిళ్ళు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల సహాయం తీసుకో వాలని సూచించారు. అన్ని శాఖలు టీమ్ వర్క్ చేయాలని, చేసే విధుల్లో ఒక్కరిపై భారం పడకుండా అందరూ భాద్యత తీసుకో వాలని అన్నారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అందరు సమన్వయంతో కలిసికట్టుగా కార్యక్రమాలను విజయ వంతం చేయాలని తెలిపారు. తిరిగి తాను కుంబాబిషేకానికి వస్తానని, అప్పటి వరకు మిగిలిన పనులు పూర్తి కావాలని తెలిపారు. జనరేటర్ సౌకర్యం, బట్టలు మార్చే గదులు, నేషనల్ హైవే కు అటవీ అనుమతులు, ఆర్ అండ్ బి, పంచాయితి రాజ్ శాఖలు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, సమాచార శాఖ ద్వారా పబ్లిసిటీ చేయాలన్నారు. నేషనల్ హైవే పై కుదురుపల్లి బ్రిడ్జి దగ్గర రోడ్డు వైడనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, దేవాలయ ఈఓ మారుతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిజిజనల్ పంచాయతి అధికారి వీరభద్రయ్య, దేవాదాయ శాఖ పరకాల డివిజన్ ఇనస్పెక్టర్ క, తదితరులు పాల్గొన్నారు.