సింగిల్ విండో చైర్మన్ గా ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ప్రశాంత్ రెడ్డి ఎన్నికైనారు. సోమవారం సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన సమావేశంలో గంగారం డైరెక్టర్ గా నున్న ప్రశాంత్ రెడ్డి ని డైరెక్టర్లు ఎన్నుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహకార అధికారి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో అధ్యక్షులు ఉన్న నారాయణరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో డైరెక్టర్లు నూతన అధ్యక్షులుగా ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, చీమల సత్యం, బాసాని హిమాకర్, సీఈఓ సతీష్ లు ఉన్నారు.
1 thought on “సింగిల్ విండో చైర్మన్ గా ప్రశాంత్ రెడ్డి”