వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
– భారీ వర్షానికి విద్యుత్ లైన్ పై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో రోడ్లు భవనాల శాఖ అతిధి గృహం ప్రహరీ గోడ పక్కన ట్రాన్స్ఫారం సమీపంలో విద్యుత్ లైన్ల పై శనివారం ఉదయం చెట్లు కొమ్మలు విద్యుత్ లైనులపై విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ శాఖ అధికారుల ఆదేశంపై, సిబ్బంది తెగిపోయిన విద్యుత్ వైర్లను అమర్చి, చెట్ల కొమ్మలను తొల గించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం లోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించ బడుతుందని సమాచారం.