వెంకటాపురం విజన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం విజన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు 

– శ్రీకృష్ణుడు సత్యభామ గోపికల వేషధారణలు. 

– వెళ్లి విరిసిన భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ కేంద్రంలోని విజన్ స్కూల్లో శనివా రం కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వ హించారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం కాగా రెండు రోజులు సెలవులు రావటంతో ముందుగానే సెలవులను దృష్టి లో ఉంచుకొని పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో కృష్ణా ష్టమి వేడుకలను ఘనంగా చేపట్టారు. శ్రీ కృష్ణుడు రాధా, సత్యభామలు,గోపికల వేషధారణ లతో చిన్నారులు వేడుక ల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఉపాథ్యా య బృందం వివరించారు. అలాగే మహాభారతం యొక్క గొప్పతనాన్ని దైవ సంకల్ప చరిత్రను విద్యార్థులకు వివరిం చారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణ, ఆహా భావా లతో విజన్ స్కూల్ ఆవరణ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా నెలకొన్నది. ఈ కార్యక్రమంలో విజన్ స్కూల్ కర స్పాండెంట్ బి.వెంకట రామారావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment