గట్టమ్మ ఎదురుపిల్ల పండగ పోస్టర్ ఆవిష్కరణ
ములుగు, తెలంగాణ జ్యోతి : ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ ప్రధాన పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద ఎదురు పిల్ల పండగ జాతర వాల్ పోస్టర్ను మంత్రులు ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. గట్టమ్మ తల్లి పూజారులకు ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఫిబ్ర వరి 14, 2024 రోజున ఆదివాసి నాయకపోడ్ల పూజారుల ఆధ్వర్యంలో చేస్తున్న ఎదురు పిల్ల పండగకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని అన్నారు. గట్టమ్మ దేవాలయం మినీ మేడారం జాతర లాగా కొనసాగుతుందని దానికి కావలసిన మౌలిక వసతులను భక్తులకు ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభు త్వం తోడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్టమ ప్రధాన పూజారులు కొత్త సదయ్య కొత్త లక్ష్మయ్య కొత్త సురేందర్ చిర్రా రాజేం దర్ కొత్త రాజేష్ అరిగెల సుమతి మోట్లపల్లి సరోజనం కొత్త నిర్మల పాల్గొన్నారు.